Page Loader
Jee advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌, స్కోర్‌ తెలుసుకోవడానికి క్లిక్‌ చేయండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌, స్కోర్‌ తెలుసుకోవడానికి క్లిక్‌ చేయండి!

Jee advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌, స్కోర్‌ తెలుసుకోవడానికి క్లిక్‌ చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌ (ఐఐటీల్లో) బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మే 18న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ కాన్పుర్‌ సోమవారం అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టినతేదీ, మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేసి, ఫలితాల లింక్‌ ద్వారా స్కోర్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా కామన్ ర్యాంక్ లిస్ట్, కేటగిరీ ర్యాంక్ లిస్ట్‌ను ఐఐటీలు విడుదల చేయనున్నాయి. పేపర్‌-1, పేపర్‌-2కు సంబంధించిన ఫైనల్ కీలు కూడా అధికారికంగా విడుదలయ్యాయి.

Details

ఈసారి సీట్లు పెరగనున్నాయ్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 1.80 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు సమాచారం. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది విద్యార్థులు పరీక్ష రాసినట్టు అంచనా. గతేడాది రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని కటాఫ్ మార్కుల ప్రకారం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనే అర్హత లభించింది. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందే అవకాశాన్ని పొందారు. 2024-25 విద్యాసంవత్సరానికి 23 ఐఐటీలలో మొత్తం 17,760 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి మద్రాస్‌ ఐఐటీ సహా కొన్ని ఇతర ఐఐటీలు కొత్త కోర్సులు ప్రారంభించడంతో సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశముంది.

Details

జూన్ 3 నుంచి జోసా-2025 కౌన్సెలింగ్ ప్రారంభం

జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA)-2025 కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్ల భర్తీ కోసం ఈసారి మొత్తం ఆరు విడతల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే JoSAA అధికారిక వెబ్‌సైట్‌లో ఐఐటీ కాన్పుర్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచింది. గతేడాది ఐదు విడతల కౌన్సెలింగ్ జరిగిందిగా, ఈసారి ఆరు విడతలుగా నిర్వహించనున్నారు.

Details

మరిన్ని వివరాలివే

జూన్ 3: రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫైలింగ్ ప్రారంభం జూన్ 9, 11: మాక్ సీట్ అలాట్‌మెంట్ 1 & 2 జూన్ 12: ఛాయిస్ లాకింగ్ జూన్ 14: మొదటి విడత సీట్ల కేటాయింపు జూన్ 21: రెండో విడత జూన్ 28: మూడో విడత జులై 4: నాలుగో విడత జులై 10: ఐదో విడత జులై 16: ఆరో విడత సీట్ల కేటాయింపులు జరగనున్నాయి.