NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Robbery in Hyderabad: హైదరాబాద్‌ నగల దుకాణంలో దోపిడి.. ముగ్గురు అరెస్ట్ 
    తదుపరి వార్తా కథనం
    Robbery in Hyderabad: హైదరాబాద్‌ నగల దుకాణంలో దోపిడి.. ముగ్గురు అరెస్ట్ 
    హైదరాబాద్‌ నగల దుకాణంలో దోపిడి.. ముగ్గురు అరెస్ట్

    Robbery in Hyderabad: హైదరాబాద్‌ నగల దుకాణంలో దోపిడి.. ముగ్గురు అరెస్ట్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 15, 2024
    04:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లోని ఓ జ్యువెలరీ షాపులో పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.

    చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్‌బాగ్ ప్రాంతంలోని దుకాణంలో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

    ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు షాపు యజమాని కుమారుడిపై కత్తులతో దాడి చేశారు. ఆ పై బంగారు ఆభరణాలను దొంగలించారు.

    వినియోగదారుడిగా వచ్చిన వేరే వ్యక్తి దుండగులకు సహకరించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దింతో పోలీసులు సీసీ ఫోటేజ్ ఆధారంగా దోపిడీకి పాల్పడిన ముగ్గురుని అదుపులో తీసుకున్నారు.

    Details 

    ముఖానికి మాస్క్‌లు ధరించి.. కత్తులతో బెదిరించి 

    చాదర్ ఘాట్‌లోని అక్బర్ చౌరస్తాలో మహ్మద్ ఉల్రా హమాన్ కిస్వా జ్యువెలర్స్ పేరుతో వెండి, బంగారు ఆభరణాల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు.

    బుధవారం మధ్యాహ్నం అతని కుమారుడు సజావుర్ రహమాన్ దుకాణంలో ఉన్నాడు.

    సుమారుగా మధ్యాహ్నం 1 గంట సమయంలో ఓ యువకుడు దుకాణానికి వచ్చి వెండి గొలుసు కావాలని అడగడంతో సజావుర్ రహమాన్ గొలుసులను చూపించాడు.

    అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్‌లు ధరించి... ఒక్కసారిగా షాపులోకి ప్రవేశించారు.

    తమ వద్ద ఉన్న కత్తులను బయటకు తీసి వెండి గొలుసులను పరిశీలిస్తున్న కస్టమర్ ని పక్కకు నెట్టి సజావూరుపై కత్తితో దాడికి యత్నించారు.

    వారిద్దరిని అడ్డుకునే క్రమంలో సజావూరు ఎడమచేవి ,ఎడమ చేయికి గాయాలయ్యాయి.

    Details 

    వచ్చిన దారిలోనే వెళ్లిన ఇద్దరు దుండగులు 

    అప్పటికే తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో బంగారు ఆభరణాలను వేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

    సమాచారం అందుకున్న చాదర్ ఘాట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఇద్దరు దుండగులు పాతబస్తీ వైపు నుంచి కమటిపుర ఫ్లైఓవర్ మీదుగా చాదర్ ఘాట్‌కు వచ్చి దోపిడి చేసి తిరిగి అదే దారిలో వెళ్లినట్లు గుర్తించారు.

    దొంగలు షాపులోకి చొరబడకముందు ఉన్న వినియోగదారుడిగా ఉన్న యువకుడు కూడా ఈముఠాలో భాగమేనని పోలీసులు అనుమానించారు.సీసీ కెమెరా ప్రకారం ఆ యువకుడిని వారు ఏమి చెయ్యలేదు.

    Details 

    ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

    సంఘటనా స్థలానికి వచ్చిన సౌత్ ఈస్ట్ ఎస్డీ సీపీ జానకీ ధరావత్ మలక్ పేట్ ఏసీబీ శ్యాంసుందర్ వివరాలు సేకరించారు.

    దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిన పోలీసులు ఇవాళ ఆ ముగ్గురిని అదుపులో తీసుకున్నారు.

    కాగా.. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సజావూరు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా
    Yusuf Pathan : కేంద్రాన్ని త‌ప్పుప‌ట్టిన తృణ‌మూల్ కాంగ్రెస్‌.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ ప‌ఠాన్  తృణమూల్ కాంగ్రెస్‌
    Systematic Investment Plan: తక్కువ జీతం.. పెద్ద సంపద? SIP పెట్టుబడితో సాధ్యమే! జీవనశైలి

    హైదరాబాద్

    Gang rape: హైదరాబాద్‌లో మహిళపై గ్యాంప్ రేప్.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి! తెలంగాణ
    Hyderabad: పాతబస్తీలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య  హత్య
    Hyderabad : ఫంక్షన్ ఉందని తీసుకెళ్లి.. భార్యను హతమార్చిన భర్త నిజామాబాద్
    Telangana : మద్యం మత్తులో కొడుకును చంపిన కసాయి.. ఆపై బలవన్మరణానికి పాల్పడ్డ నాన్న  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025