Loading...
Jharkhand: అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల ర్యాలీ.. జార్ఖండ్‌లో ఉద్రిక్త పరిస్థితులు
అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల ర్యాలీ.. జార్ఖండ్‌లో ఉద్రిక్త పరిస్థితులు

Jharkhand: అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల ర్యాలీ.. జార్ఖండ్‌లో ఉద్రిక్త పరిస్థితులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై నిరసనలతో కొద్దిరోజుల క్రితం దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా జార్ఖండ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఝార్ఖండ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (JPSC) ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో.. నియామక పరీక్షల్లో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర శాసనసభను ముట్టడించేందుకు వారు ర్యాలీగా బయలుదేరడంతో ఉద్రిక్తత నెలకొంది. బారికేడ్లను దాటుకుంటూ విద్యార్థులు ముందుకు సాగేందుకు ప్రయత్నించగా.. వారిని నిలువరించేందుకు పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు.

వివరాలు 

ఆందోళనలో పాల్గొనేందుకు రాంచీకి వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు

విద్యార్థి నేత దేవేంద్రనాథ్‌ మహతో నాయకత్వంలో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.

ఆందోళనలో పాల్గొనేందుకు వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు రాంచీకి తరలివచ్చారు.

పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదే సమయంలో తమ డిమాండ్ల సాధన కోసం ఆరుగురు విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష కూడా కొనసాగుతోంది.

మరోవైపు జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ అయిందన్న ఆరోపణలు ఈ వ్యవహారాన్ని మరింత తీవ్రం చేశాయి.

ఈ నేపథ్యంలో జార్ఖండ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు చెందిన ముగ్గురు సభ్యులు ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు.

వివరాలు 

డిమాండ్‌పై స్పష్టత వచ్చే వరకు తమ ఆందోళన

వీరిని ఆగస్టు 10 నుంచి సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీసులు 19 మందిని అరెస్టు చేశారు. దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

ఇదిలా ఉండగా.. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వారి డిమాండ్లలో పలు అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

అయితే జేపీఎస్సీ వ్యవహారంపై జరుగుతున్న కేసు విచారణను సీబీఐకు అప్పగించాలన్న ప్రధాన డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో విద్యార్థులు వెనక్కి తగ్గలేదు.

ఈ డిమాండ్‌పై స్పష్టత వచ్చే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని వారు ప్రకటించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల యత్నం

ADVERTISEMENT