Loading...
JNTU Hyderabad: జేఎన్‌టీయూకు తొలిసారి అంతర్జాతీయ గుర్తింపు.. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో చోటు
జేఎన్‌టీయూకు తొలిసారి అంతర్జాతీయ గుర్తింపు.. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో చోటు

JNTU Hyderabad: జేఎన్‌టీయూకు తొలిసారి అంతర్జాతీయ గుర్తింపు.. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో చోటు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్'లోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)కు తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రముఖ అంతర్జాతీయ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ క్వాక్వారెల్లీ సైమండ్స్‌(క్యూఎస్‌)తాజాగా ప్రకటించిన ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో జేఎన్‌టీయూకు చోటు దక్కింది. ఆసియా దేశాల్లోని 3,600కు పైగా విద్యాసంస్థలను విశ్లేషించిన క్యూఎస్‌ సంస్థ.. జేఎన్‌టీయూకు 1200-1300 బ్యాండ్‌లో ర్యాంకును కేటాయించింది. దీంతో జేఎన్‌టీయూ అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల జాబితాలో చేరింది. విశ్వవిద్యాలయానికి తొలిసారి క్యూఎస్‌ ర్యాంకు లభించడంపై వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ టి. కిషన్‌కుమార్‌ రెడ్డి, రెక్టార్‌ దామోదరం, రిజిస్ట్రార్‌ జయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. క్యూఎస్‌ ఆసియా ర్యాంకింగ్స్‌లో తొలిసారి స్థానం సంపాదించడం విశ్వవిద్యాలయ ఆచార్యులు,విద్యార్థులు,సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.

వివరాలు 

అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాల లేమి

అయితే, విశ్వవిద్యాలయం ప్రస్తుతం కొన్ని సమస్యలను ఎదుర్కొంటోందని వీసీ తెలిపారు.

ముఖ్యంగా అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాల లేమి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు మంజూరు కాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని వివరించారు.

ఈ సవాళ్లను అధిగమించి భవిష్యత్తులో మరింత మెరుగైన ర్యాంకును సాధించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

ADVERTISEMENT