Job Guarantee: డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ హామీ.. రేపటి నుంచి కొత్త అవకాశాలు
రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సురెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు రేపు ప్రారంభించనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బీఎఫ్ఎస్ఐ రంగంలో నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రత్యేక మినీ డిగ్రీ కోర్సును ప్రారంభించనున్నారు. ఈ కోర్సు ద్వారా 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలకు చెందిన 10,000 మంది విద్యార్థులు శిక్షణ పొందనున్నారు. ఈ కోర్సు డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించనున్నారు. విద్యార్థుల శిక్షణకు సంబంధించిన వివరాలు, వారి బయోడేటా, విద్యా అర్హతలు, సాంకేతిక అనుభవం వంటి వివరాలు నమోదు చేసేందుకు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ రూపొందిస్తోంది.
ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు
ఈ ప్రత్యేక పోర్టల్ ద్వారా, బీఎఫ్ఎస్ఐ రంగంలో ప్రముఖ కంపెనీలు విద్యార్థులను నేరుగా వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఇది విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం కొత్త మార్గాలను నిర్మించింది. ఈ మినీ డిగ్రీ కోర్సుకు సిలబస్‌ను బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం రూపొందించింది. సీఎస్ఆర్ నిధుల ద్వారా ప్రోగ్రాంను నిర్వహించేందుకు ఈక్వీవ్‌యూఐపీపీపీ సంస్థ రూ.2.50 కోట్లను అందించింది. ఈక్వీవ్‌యూఐపీపీపీ సంస్థతో పాటు మంత్రి శ్రీధర్ బాబు నిర్వహించిన చర్చల ఫలితంగా, ఈ ప్రోగ్రాంను మూడు సంవత్సరాల పాటు నిర్వహించేందుకు అవసరమైన నిధులను సమీకరించారు.
ఈ కోర్సుకు ఎంపిక చేసిన కాలేజీలు
(నాన్ ఇంజనీరింగ్ 20 కాలేజీలు) 1)పింగళి ప్రభుత్వ మహిళా కాలేజీ, వడ్డేపల్లి, హన్మకొండ 2)ఎస్.ఆర్ & బి.జి.ఎన్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, ఖమ్మం 3)నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్గొండ 4)ఆంధ్రా మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, హైదరాబాద్ 5)భవన్ డిగ్రీ మరియు పి.జి కాలేజీ, హైదరాబాద్ 6)ప్రభుత్వ సిటీ కాలేజీ, హైదరాబాద్ 7)ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సిద్దిపేట 8)ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, బేగంపేట 9) ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్ 10) ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ, నాంపల్లి
ఈ కోర్సుకు ఎంపిక చేసిన కాలేజీలు 1/2
11) నిజాం కాలేజీ, హైదరాబాద్ 12) ఆర్.బి.వి.ఆర్.ఆర్ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్ 13) సెయింట్ అన్స్ మహిళా డిగ్రీ కాలేజీ, మెహిదీపట్నం 14) సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కాలేజీ, హైదరాబాద్ 15) సెయింట్ పియస్ ఎక్స్ మహిళా డిగ్రీ కాలేజీ, నాచారం 16) తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సంగారెడ్డి 17)ఎం.వి.ఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, మహబూబ్‌నగర్ 18) ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్ 19) తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి 20) గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, నిజామాబాద్
ఇంజనీరింగ్ కాలేజీలు జాబితా ఇదే
1. బివిఆర్‌ఐటి హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ (జెఎన్‌టియు హెచ్) 2. జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (జెఎన్‌టియు హెచ్) 3. గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ & టెక్నాలజీ కాలేజీ (జెఎన్‌టియు హెచ్) 4. జె.బి ఇంజనీరింగ్ & టెక్నాలజీ కాలేజీ (జెఎన్‌టియు హెచ్) 5. జెఎన్‌టియు, కూకట్‌పల్లి ప్రధాన క్యాంపస్ (జెఎన్‌టియు హెచ్) 6. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జెఎన్‌టియు హెచ్) 7. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జెఎన్‌టియు హెచ్) 8. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ (జెఎన్‌టియు హెచ్) 9. వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (జెఎన్‌టియు హెచ్)
ఇంజనీరింగ్ కాలేజీలు జాబితా ఇదే 1/2
10. కిట్స్, వరంగల్ (కేయూ) 11. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఓయూ) 12. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) 13. మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) 14. మెథడిస్ట్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కాలేజీ (ఓయూ) 15. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) 16. స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ & టెక్నాలజీ కాలేజీ (ఓయూ) 17. ఆర్జీయుకేటీ, బాసర (ఆర్జీయుకేటీ) 18. బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్ (జెఎన్‌టియు హెచ్)