Page Loader
Kamal Haasan: తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి కమల్ హాసన్ మద్దతు
Kamal Haasan: తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి కమల్ హాసన్ మద్దతు

Kamal Haasan: తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి కమల్ హాసన్ మద్దతు

వ్రాసిన వారు Stalin
Mar 09, 2024
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan)కు చెందిన మక్కల్ నీది మయం (MNM ) పార్టీ తమిలనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని, కాంగ్రెస్-డీఎంకే కూటమికి మద్దతు ఇస్తున్నట్లు కమల్‌హాసన్‌ చెప్పారు. పదవుల కోసం కాదని, దేశం కోసం తాము చేతులు కలిపినట్లు పేర్కొన్నారు. పొత్తులో భాగంగా 2025లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి ఒక సీటును కేటాయించనున్నారు. ఇరు వర్గాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో DMK కూటమికి మద్దతుగా ఎంఎన్ఎం ప్రచారం చేయనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పొత్తు వివరాలను వెల్లడిస్తున్న కమల్ హాసన్