Page Loader
జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత
జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత

వ్రాసిన వారు Stalin
Feb 07, 2023
06:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఘజియాబాద్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టులో అయూబ్‌ను ప్రశ్నించేందుకు జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం అనుమతించింది. అయితే ట్రయల్ కోర్టులో అధికార పరిధి సమస్యపై చర్చించడానికి అయ్యూబ్‌ను న్యాయస్థానం అనుమతించింది.

సుప్రీంకోర్టు

జల్సాల కోసం సొమ్మును దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపణ

కోవిడ్ -19 రోగుల కోసం క్రౌడ్ ఫండింగ్‌ను అయ్యూబ్ ప్రారంభించారని, ఆ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపణల నేపథ్యంలో అయ్యూబ్‌పై నవంబర్‌లో మనీలాండరింగ్‌తో పలు అభియోగాలు మోపారు. ఆమె జల్సాల కోసం సేకరించిన సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గత ఏడాది నవంబర్ 29న ఘజియాబాద్‌లోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (ఛార్జ్ షీట్)ను పరిగణనలోకి తీసుకుని అయ్యూబ్‌కు సమన్లు ​​జారీ చేసింది. మనీలాండరింగ్ జరిగిందన్న బ్యాంకు అకౌంట్ ముంబయి పరిధిలో ఉందని, అందువల్ల విచారణ ఘజియాబాద్‌ కోర్టు పరిధిలోకి రాదని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఘజియాబాద్‌లో ఈడీ విచారణను రద్దు చేయాలని అయూబ్ తన రిట్ పిటిషన్‌లో కోరారు. ఆమె అభ్యర్థ్యను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.