LOADING...
MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స

MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్రమైన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఇటీవల గుండె నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఈ రోజు మరింత విషమించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు తక్షణమే ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని హరీష్ రావు మీడియాతో వెల్లడించారు. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ కు వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నారు, చికిత్సకు స్పందిస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు.