Ramcharan: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న ఎన్‌టీఆర్, రామ్‌చరణ్
నేడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయానికి రానున్నారు.ఉదయం 11 గంటల తరువాత వీరిద్దరూ సచివాలయానికి చేరుకోనున్నారు. ఇటీవల వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న విజయవాడ ప్రాంతాల ప్రజలకు సహాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పిలుపుకు స్పందిస్తూ, ఎన్టీఆర్. రామ్ చరణ్‌లు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF)కి సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఈ ఇద్దరు నటులు ట్విట్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలకు 50 లక్షల రూపాయలు చొప్పున విరాళం అందిస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం, నేడు వీరు తమ విరాళాన్ని సచివాలయానికి అందించనున్నారు.
ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ₹1కోటి విరాళం
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ,"రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు నన్ను తీవ్రంగా కలచివేసాయి.ఈ విపత్తు నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.వరద విపత్తు నుండి ఉపశమనం కలిగించేందుకు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధికి ₹50లక్షల విరాళం అందిస్తున్నాను" అన్నారు. "వర్షాలు,వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నప్రజలకు మనం తోడుగా,అండగా ఉండాల్సిన సమయం ఇది.నా వంతుగా ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ₹1కోటి విరాళం అందిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను"అని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా అన్నారు. వీరిద్దరూ ప్రకటించిన విధంగానే నేడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు.