తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్ళు, వాటి వివరాలు, టికెట్ ధరల ఇవే..
ఈ నెల 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, మరో 9వందే భారత్ రైళ్ళను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అందులో రెండు రైళ్ళు తెలుగు రాష్టాల గుండా వెళ్ళనున్నాయి. కాచిగూడ- యశ్వంత్ పూర్, చెన్నై- విజయవాడ మీదుగా వందే భారత్ రైళ్ళు ప్రయాణించనున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం. కాచిగూడ - యశ్వంత్ పూర్ రైలు వివరాలు: కాచిగూడ నుండి ఉదయం 5:30గంటలకు ప్రారంభమవుతుంది. యశ్వంత్ పూర్ చేరుకోవడానికి 8:30గంటల సమయం తీసుకుని మధ్యాహ్నం 2గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. కాచిగూడ-యశ్వంత్ పూర్ ప్రయాణానికి చైర్ కార్ ధర 1600రూపాయలు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ 2915గా ఉంది. యశ్వంత్ పూర్-కాచిగూడ తిరుగు ప్రయాణానికి చైర్ కార్ 1540రూపాయలుగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ 2865గా ఉంది.
చెన్నై - విజయవాడ టికెట్ ధరలు
చెన్నై నుండి ఉదయం 5:30గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుంది. 6గంటల 40నిమిషాల్లో విజయవాడ చేరుకుంటుంది. అంటే మధ్యాహ్నం 12:10గంటల వరకు విజయవాడ స్టేషన్లో ఉంటుంది. చెన్నై నుండి విజయవాడ చైర్ కార్ టికెట్ ధర 1920రూపాయలు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర 2540గా ఉంది. విజయవాడ నుండి చెన్నై తిరుగు ప్రయాణంలో చైర్ కార్ టికెట్ ధర 1420రూపాయలు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర 2630గా ఉంది. చెన్నై నుండి విజయవాడ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మంగళవారం తప్ప మిగిలిన ఆరు రోజుల్లో అందుబాటులో ఉంటుంది. కాచిగూడ నుండి యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ బుధవారం తప్ప అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది.