LOADING...
Kakinada: కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ రైతులకు గుడ్ న్యూస్.. అదేంటంటే..?
కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ రైతులకు గుడ్ న్యూస్.. అదేంటంటే..?

Kakinada: కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ రైతులకు గుడ్ న్యూస్.. అదేంటంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2025
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాకినాడ SEZ భూములపై విరాళంగా, నేటికి సుధీర్ఘ‌కాలంగా పోరాటం చేస్తున్న రైతులుకు కూటమి ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. గతంలో సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారికంగా త్వరలో ప్రకటన వెలువడే అవకాశముంది. భూములను తిరిగి ఇవ్వడమే కాక, రైతుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలను మినహాయించాలని కూడా నిర్ణయించారు. ఈ వార్తతో కాకినాడ SEZ పరిధిలోని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

1551 మంది రైతుల‌కు మేలు.. 

కాకినాడ SEZ పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సుమారు 2,180 ఎకరాల భూములను స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి రైతుల పేర్లపై రిజిస్టర్ చేయడం కోసం ముందుకొచ్చారు. ఈ విష‌యాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దృష్టికి తీసుకువెళ్లి, ఎన్నో సంవత్సరాలుగా అచేతనంగా ఉన్న సమస్యను పరిష్కరించారు. దీంతో, తూర్పు కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల సుమారు 1,551 రైతులకి లాభం చేకూరనున్నది. రాష్ట్ర రెవెన్యూ శాఖలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకమని రైతులు పేర్కొంటున్నారు.

వివరాలు 

2180 ఎకరాలు వెనక్కి.. రైతుల్లో సంతోషం.. 

కాకినాడ SEZకు కేటాయించిన భూములలో ఎక్కువగా ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల భూములు ఉన్నాయి. ఈ భూములు అప్పటికే SEZ కి ఇవ్వబడ్డా, రైతుల పేర్లపై రిజిస్ట్రేషన్ జరగలేకపోయిన పరిస్థితి ఉంది. అందువలన, 2,180 ఎకరాలను రైతులకు తిరిగి ఇస్తూ, రైతుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాల ప్రకారం,ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలు రైతుల వద్ద నుండి వసూలు చేయవద్దని స్పష్టంగా పేర్కొన్నారు.

వివరాలు 

గ‌త ప్ర‌భుత్వంలో జీవో నెం. 12 విడుద‌ల అయినా.. 

గత ప్రభుత్వం జీవో నం.12 ద్వారా భూములను రైతులకు అప్పగించాలనుకుంది, కానీ ఆ జీవో అమలు కాలంలో నిజంగా రైతులకు లాభం కలగలేదు. భూముల రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో పిల్లల విద్య, వివాహాలు, బ్యాంక్ రుణాలు పొందడంలోనూ రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. భూములు రైతుల పేర్లలో రిజిస్టర్ కాకపోవడం వలన ప్రభుత్వం అందించే భరోసా పథకాల నుండి కూడా రైతులు దూరమయ్యారు. ఇటీవల జ‌న‌సేన ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పి.హరిప్రసాద్ కూడా ఈ సమస్యను శాసనమండలి దృష్టికి తెచ్చారు.

వివరాలు 

రైతుల్లో సంతోషం 

కాకినాడ SEZ రైతుల భూములను తిరిగి రిజిస్టర్ చేయడానికి స్టాంప్, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ ఆదేశాలు విడుదలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయంతో రైతులకు ఊరట కలిగించింది. రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

వివరాలు 

కాకినాడ సెజ్ భూముల వెనుక క‌థ ఇదీ.. 

కాకినాడ SEZ భూములు 2006-2008 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో ఉప్పాడ,కొత్తపల్లి,తొండంగి మండలాల్లో సేకరించారు. మొత్తం 10,000 ఎకరాలకు పైగా ఉన్న భూముల్లో 2,180 ఎకరాలు ప్రస్తుతం చర్చలో ఉన్నాయి. అప్పటి ఎక్స్‌పోర్ట్ పాలసీ ప్రకారం SEZలు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చింది. ఆర్థిక అభివృద్ధి,ఉద్యోగ సృష్టి,ఎక్స్‌పోర్ట్ పెంపు కోసం రిలయన్స్,అరోబిందో ఫార్మా వంటి పెద్ద కంపెనీలతో SEZ ప్రాజెక్టు రూపకల్పన చేయబడి,కొంతమంది రైతుల నుంచి భూములు స్వచ్ఛందంగా తీసుకున్నప్పటికీ, కొన్ని భూములు బలవంతంగా సేకరించారు. ఫలితంగా, భూములు ఎక్కువ సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయి, ప్రాజెక్ట్ పెద్దగా అభివృద్ధి చెందలేదు. తాజాగా, భూములను తిరిగి ఇవ్వడమే కాక, రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలను మినహాయిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.