Karnataka Assembly: 8 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. అసెంబ్లీ ముందు కలకలం
రుణ బకాయిలను రికవరీ చేసేందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో కలత చెంది బుధవారం బెంగళూరులోని కర్నాటక అసెంబ్లీ ఎదుట ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. విధానసౌధ (కర్ణాటక అసెంబ్లీ) బయట మహిళలు, పిల్లలతో సహా కుటుంబ సభ్యులు తమపై కిరోసిన్ పోసుకున్నారు. అయితే, పోలీసులు జోక్యం చేసుకోని కుటుంబ సభ్యులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరు సిటీ కోఆపరేటివ్ బ్యాంక్‌లో 2016లో అల్లం సాగు వ్యాపారం చేసేందుకు రూ.50 లక్షలు రుణం తీసుకున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే,కుటుంబం ₹ 95 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించగలిగింది.