LOADING...
DK Shivakumar: కర్ణాటకలో డిన్నర్ రాజకీయం.. డీకే శివకుమార్ కీలక అడుగు
కర్ణాటకలో డిన్నర్ రాజకీయం.. డీకే శివకుమార్ కీలక అడుగు

DK Shivakumar: కర్ణాటకలో డిన్నర్ రాజకీయం.. డీకే శివకుమార్ కీలక అడుగు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాజకీయాలు గత కొన్ని నెలలుగా హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తరచుగా దిల్లీ ప్రయాణాలు చేయడం, బ్రేక్‌ఫాస్ట్ సమావేశాలు పెట్టడం వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) తాజాగా విందుతో కూడిన రాజకీయ సమీకరణాలకు వేదికయ్యారు. గురువారం రాత్రి 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో కలిసి శివకుమార్ డిన్నర్ చేశారు. వారిలో కొంతమంది మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశం కాంగ్రెస్ నేత ప్రవీణ్‌ (Praveen Doddananavar) ఫామ్‌హౌస్‌లో జరిగినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భాజపా నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఎస్.టి. సోమశేఖర్, శివరామ్ హెబ్బర్ కూడా ఈ విందుకు హాజరైనట్టు చెబుతున్నారు.

వివరాలు 

స్నేహపూర్వక సమావేశం మాత్రమే: డీకే శివకుమార్

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కొద్దిమంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కూడా ముందురోజు ఇలాంటి విందులో పాల్గొనగా, ఆ ఆతిథ్య బాధ్యతలను బెళగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ నిర్వహించడం విశేషం. అయితే ఈ సమావేశాలు సాధారణమేనని నేతలు అంటున్నారు. "ఒక ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నాం అంతే. అందులో ప్రత్యేకతగా చెప్పుకోదగ్గది ఏమీలేదు. అది కేవలం స్నేహపూర్వక సమావేశం మాత్రమే'' అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కాగా, ఇటీవల కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాల నడుమ ఇవి శక్తి ప్రదర్శనలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement