నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం
ఈ వార్తాకథనం ఏంటి
నందిని నెయ్యిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. లడ్డూల తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తాము 'నందిని' బ్రాండ్ నెయ్యి సరఫరాను నిలిపివేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) చైర్మన్ భీమా నాయక్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.
కేఎంఎఫ్ చేసిన ప్రకటనను టీటీడీ బోర్డు ఖండించింది. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ వివాదానికి కూడా కారణమైంది.
టీటీడీ టెండర్ ప్రక్రియలో కేఎంఎఫ్ పాల్గొనకపోవడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ 'హిందూ వ్యతిరేక' విధానంగా బీజీపీ ఆరోపిస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీపై ఎదురుదాడికి దిగింది. బీజేపీ ప్రభుత్వ హయాంలో తిరుమలకు నందిని నెయ్యి సరఫరా ఆగిపోయిన విషయాన్ని గుర్తు చేసింది.
నెయ్యి
అసలు కారణం ఇదీ
వాస్తవానికి టీటీడీ బోర్డు టెండర్ ప్రక్రియ ద్వారా నెయ్యి విక్రేతను ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలో ఈ సారి నిర్వహించే టెండర్ లో పాల్గొనొనద్దని కేఎంఎఫ్ నిర్ణయించింది.
ఈ క్రమంలో కేఎంఎఫ్ టెండర్‌లో పాల్గొనకపోవడం జులై 30న తక్కువ మొత్తానికి కోట్ చేసిన కంపెనీకి ఈ టెండర్‌ను అప్పగించారు.
గత ఇరవై ఏళ్లుగా టీటీడీ టెండర్‌లో పాల్గొంటున్న కేఎంఎఫ్, ఈ సారి పాల్గొనకపోవడానికి బలమైన కారణం ఉంది.
భారీగా పెరిగిన పాల ధరలకు అనుగూనంగా టీటీడీ బోర్డు నెయ్యి ధరను పెంచకపోవడం వల్లే, టెండర్ ప్రక్రియకు దూరంగా ఉండాలని కేఎంఎఫ్ నిర్ణయించింది.