LOADING...
Tungabhadra: తుంగభద్రపై ఏపీ, కర్ణాటకలను కలుపుతూ కొత్త వంతెన ఏర్పాటు 
తుంగభద్రపై ఏపీ, కర్ణాటకలను కలుపుతూ కొత్త వంతెన ఏర్పాటు

Tungabhadra: తుంగభద్రపై ఏపీ, కర్ణాటకలను కలుపుతూ కొత్త వంతెన ఏర్పాటు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
08:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు సహా తుంగభద్ర నది పై మరిన్ని ప్రాజెక్టులు చేపట్టాలని చూస్తున్న కర్ణాటక ప్రభుత్వం, ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక మధ్య రాకపోకలు మెరుగుపడటంతో పాటు, ఆ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా పెరుగేందుకు తుంగభద్ర నదిపై ఒక కొత్త బ్యారేజి, వంతెన నిర్మించాలని కర్ణాటక ప్రతిపాదిస్తోంది. ఈ నిర్మాణం కోసం తమ రాష్ట్ర నిధులనే వినియోగిస్తామని, దీనికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కూడా కోరుతోంది.

వివరాలు 

నిర్వహణ మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు..

కర్ణాటక రాయచూర్‌ జిల్లాలోని మాన్వి తాలూకా చిక్కలపర్వి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కౌతాలం మండలం కుంబలనూరు వరకు ఈ బ్యారేజి-వంతెన నిర్మించాలని యోజన ఉంది. ఈ విషయం పై కర్ణాటక చిన్న నీటి వనరులశాఖ మంత్రి ఎన్‌.ఎస్‌. బోస్‌రాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ఇప్పటికే లేఖలు పంపించారు. తాజాగా పంపిన మరో లేఖలో ఈ బ్యారేజి నిర్మాణం అనంతరం నిర్వహణ మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు అప్పగిస్తామని, కాబట్టి ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదని పేర్కొన్నారు.

వివరాలు 

రాకపోకలు మెరుగవుతాయి -కర్ణాటక 

కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ, గుత్తి (ఆంధ్రప్రదేశ్)-మాన్వి (కర్ణాటక) మధ్య రహదారి నిర్మాణానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ రహదారి పత్తికొండ, ఆదోని, మదిరె, హల్వి, కుంబలనూరు మీదుగా మాన్వి చేరేలా ప్రణాళిక ఉంది. తుంగభద్ర నదిపై ప్రతిపాదిత బ్యారేజి-వంతెన నిర్మాణానికి 2024-25 కర్ణాటక బడ్జెట్‌లో ఇప్పటికే నిధులు కేటాయించినట్లు బోస్‌రాజు ఆ లేఖలో వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధి కూడా వేగం అందుకుంటుందనే అభిప్రాయం ఆయనది.

వివరాలు 

ఏపీ అధికారుల సందేహాలు 

ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ అధికారులు మాత్రం ఈ ప్రతిపాదనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఏవీ నిర్ణయించలేదు. బ్యారేజి నిర్వహణ బాధ్యత మన రాష్ట్రానికి ఇచ్చినా, కర్ణాటక ఎగువప్రాంతంలో నీటిని ఎలా నిల్వచేసినా, మళ్లించినా మనం నియంత్రించలేమని పేర్కొంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ నీటి హక్కులకు భంగం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

వివరాలు 

ప్రతిపాదనలో ముఖ్యాంశాలు 

నిల్వ చేయబోయే నీరు 0.351 టీఎంసీలు, గేట్ల సంఖ్య మొత్తం 73, తక్కువ ప్రవాహకాలంలో ఏర్పాటు 7 గేట్లు తెరిచి దిగువకు నీరు వెళ్లేలా నిర్ణయం,నీటి వార్షిక వినియోగ అంచనా 168 టీఎంసీలు,ప్రస్తుత నీటి లభ్యత.. అంచనా. తుంగభద్ర ఎగువ ప్రాంతాల్లో ఇటీవలి వర్షాల ప్రభావంతో ఈ నీటి ఏడాదిలో సుమారు 168 టీఎంసీల నీరు వినియోగానికి అందుబాటులో ఉంటుందని ఇంజనీరింగ్ అధికారుల సమీక్షలో తేలింది. కర్ణాటక,ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ రాష్ట్రాల పర్యవేక్షక ఇంజినీర్లు పాల్గొన్న సమావేశాన్ని మండలి పర్యవేక్షక ఇంజినీర్‌ నారాయణ్‌ నాయక్‌ నిర్వహించారు. ప్రస్తుతం జలాశయానికి 270 టీఎంసీల నీరు చేరగా,అందులో: 70 టీఎంసీలు ఆయకట్టు ప్రాంతాలకు విడుదల 120 టీఎంసీలు నదిప్రవాహంగా వెళ్ళిపోయినవి ప్రస్తుతం 80టీఎంసీలు నిల్వ ఉన్నాయని ఆయన వివరించారు.