
Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విజయ్
ఈ వార్తాకథనం ఏంటి
టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీ ఘోర విషాదంతో ముగిసింది. కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయి, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో విజయ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కరూర్ ఘటనపై టీవీకే అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విజయ్ మరోసారి స్పందించారు. తన హృదయం ఇంకా భారంగా ఉందని, అభిమానులను కోల్పోవడం వల్ల వచ్చే బాధను పదాల్లో చెప్పలేమని తెలిపారు.
Details
గాయపడిన వారికి రూ.2లక్షలు
ప్రచార సమయంలో అభిమానుల ముఖాల్లో చూసిన ఆనందం ఇప్పటికీ కళ్ల ఎదుట కదలాడుతోందని పేర్కొన్నారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ, తాను ఆ దుఃఖాన్ని మోస్తున్నానని విజయ్ చెప్పారు. ఇది తమకు కోలుకోలేని నష్టమని అభిప్రాయపడ్డారు. మృతుల కుటుంబానికి ఇచ్చే రూ.20 లక్షలు, గాయపడిన వారికి ఇవ్వబోయే రూ.2 లక్షలు వారి బాధను పూర్తిగా తీర్చలేవు, కానీ బాధిత కుటుంబానికి అండగా నిలవడం తన కర్తవ్యమని విజయ్ తెలిపారు. చివరిగా చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థన చేశారు.