Kashmiri girls: ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టిన కశ్మీరీ యువతులు.. నెటిజన్ల ఫిదా
ఈ వార్తాకథనం ఏంటి
రక్షాబంధన్ పండుగ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని కశ్మీరీ యువతులు, పాఠశాల విద్యార్థినులు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. దేశ రక్షణ కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లకు రాఖీలు కట్టి.. మిఠాయిలు తినిపించారు.
వివరాలు
కశ్మీరీ ఆడబిడ్డలకు జవాన్లు కూడా ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ..
ఈ సందర్భంగా కశ్మీరీ సోదరీమణులు చూపించిన ప్రేమకు సైనికులు భావోద్వేగానికి గురయ్యారు.
దేశ సరిహద్దుల్లో తమ రక్షణ కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న జవాన్లకు కృతజ్ఞతగా యువతులు ఈ రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు.
తమను సోదరులుగా భావించి రాఖీలు కట్టిన కశ్మీరీ ఆడబిడ్డలకు జవాన్లు కూడా ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వివరాలు
హృదయాన్ని హత్తుకునే సంఘటన..
సైనికులు, కశ్మీరీ యువతుల మధ్య చోటుచేసుకున్న ఈ ఆప్యాయ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో చూసిన నెటిజన్లు కశ్మీరీ యువతుల ప్రేమాభిమానాలను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
దేశాన్ని కాపాడే సైనికులకు ఇలాంటి ఆత్మీయతను చూపించడం నిజంగా హృదయాన్ని హత్తుకునే విషయమంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Banihal, J&K
— Zinda Dil Kashmir (@jindadlKashmir) August 28, 2026
On Raksha Bandhan, local Kashmiri girls tied rakhis to Army jawans, celebrating a bond built on trust, respect and brotherhood.
This is the spirit of Kashmir: warmth, harmony and togetherness, spreading a message of peace and positivity far beyond the valley.… pic.twitter.com/M6WkerZ7dP