'కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదు'.. కేంద్రంపై ఒమర్ అబ్దుల్లా ఫైర్
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు అనేవి కశ్మీర్ ప్రజల హక్కు అన్నారు ఒమర్ అబ్దుల్లా. అయితే వాటిని నిర్వహంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని అడుక్కోరని చెప్పారు. కశ్మీరీ ప్రజలు బిచ్చగాళ్లు కాదని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఆస్తులు, ప్రభుత్వ భూముల నుంచి ప్రజలను ఖాళీ చేయించడంపై ఆయన స్పందిసూ.. ఈ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించకపోవడానికి ఇది ఒక కారణమని చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వం.. ప్రజల గాయాలను మాన్పడానికి ప్రయత్నిస్తుందని కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని చెప్పారు. అందుకే బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు.
కశ్మీర్ ప్రజలను మోసం చేసిన బీజేపీ
ఉగ్రవాద దాడుల నేపథ్యంలో గ్రామ రక్షణ గార్డులకు ఆయుధాలు కల్పించాలని తీసుకున్న నిర్ణయం.. కేంద్రం తన వైఫల్యాన్ని వైఫల్యాన్ని అంగీకరించడమేనని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసే సమయంలో తుపాకీ సంస్కృతి తగ్గుముఖం పడుతుందని చెప్పిన బీజేపీ.. కశ్మీర్ ప్రజలను మోసం చేసిందన్నారు. జమ్ము, కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవలే గ్రామ రక్షణ కమిటీలు అని పిలువబడే గ్రామ రక్షణ కమిటీలకు ఆయుధాలను ఇవ్వడం ప్రారంభించింది. రాజౌరి జిల్లాలోని ధంగ్రీ సంఘటనలో ఏడుగురు వ్యక్తులు ఉగ్రవాదులు హత్య చేసిన నేపథ్యంలో గ్రామ రక్షణ కమిటీలకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆయుధ శిక్షణ అందిస్తోంది.