Loading...
Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేనకు గుర్తింపు ఇవ్వండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత విజ్ఞప్తి
తెలంగాణ రక్షణ సేనకు గుర్తింపు ఇవ్వండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత విజ్ఞప్తి

Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేనకు గుర్తింపు ఇవ్వండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత విజ్ఞప్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

'తెలంగాణ రక్షణ సేన' పార్టీకి అధికారిక గుర్తింపు ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పంపిన లేఖకు స్పందిస్తూ ఆమె ఆదివారం తన వివరణను పంపించారు. తొలుత ఎన్నికల సంఘం ఆమోదించిన 'తెలంగాణ రక్షణ సేన'పేరును విశ్వసించి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశామని కవిత తెలిపారు. ఇప్పుడు అదే పేరును మార్చుకోవాలని చెప్పడం వల్ల తమ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు అన్యాయం జరిగినట్లవుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు.

వివరాలు 

ప్రణాళికాబద్ధంగా అభ్యంతరాలు

పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా సుమారు వెయ్యిఅభ్యంతరాలు వచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నప్పటికీ,వాటిని ఎవరు దాఖలు చేశారు?ఏ కారణాలతో అభ్యంతరాలు వ్యక్తం చేశారు? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదని కవిత ప్రశ్నించారు.

అభ్యంతరాల వివరాలు తమకు అందించకుండా వాటిపై సమగ్రసమాధానం ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు.

కావాలనే కొందరు వ్యక్తులు లేదా గ్రూపులు ప్రణాళికాబద్ధంగా అభ్యంతరాలు దాఖలు చేశారా అనే అంశం కూడా వాటి కాపీలు పరిశీలించిన తర్వాతే స్పష్టమవుతుందని తెలిపారు.

అందువల్ల తమ పార్టీ పేరుకు సంబంధించి ఎన్నికలసంఘానికి అందిన అన్ని అభ్యంతరాల కాపీలను తమకు అందించాలని కవిత విజ్ఞప్తి చేశారు.

అభ్యంతరాల పూర్తివివరాలు వెల్లడించిన తర్వాతే వాటికి చట్టపరంగా,వాస్తవాల ఆధారంగా సమాధానం ఇవ్వగలమని ఆమె స్పష్టం చేశారు.

ADVERTISEMENT