
రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త; ఈనెల 26నుంచి రైతుబంధు నగదు జమ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదును జమ చేయనున్నట్లు ప్రకటించారు.
రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతుబంధు నగదు జమ అవుతుందని స్పష్టం చేశారు.
అలాగే అర్హులైన పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పట్టాల పంపిణీ తర్వాత రైతు బంధును కూడా పోడు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
దీంతో పట్టాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోడు రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వానకాలం 'రైతుబంధు' నిధులను విడుదల చేయాలని కేసీఆర్ ఆదేశం
వానకాలం పంట పెట్టుబడి 'రైతుబంధు' నిధులను జూన్ 26 నుండి విడుదల చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
— Telangana CMO (@TelanganaCMO) June 19, 2023
రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో ఆర్థిక సాయం జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖా మంత్రి శ్రీ హరీష్ రావును, ప్రత్యేక… pic.twitter.com/hyQZ0Tf7bS
కేసీఆర్
హైదరాబాద్ నుంచి కందుకూరు వరకు మెట్రో రైలు విస్తరణ: సీఎం కేసీఆర్
రాజధాని ప్రాంతంలోని మరిన్ని ప్రాంతాలకు హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్‌ను విస్తరింపజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రకటించారు.
రంగారెడ్డిలోని తూములూరు గ్రామంలో హరితహారం ఫేజ్-9ను ప్రారంభించిన ఆయన కీలక వ్యాఖ్యలుచేశారు.
హైదరాబాద్ మెట్రో రైలును శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించడం త్వరలో పూర్తవుతుందని, దానిని మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు వరకు పొడిగించనున్నట్లు చెప్పారు.
కందుకూరు వరకు మెట్రో రైల్‌ను పొడిగించాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చేసిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్, ఇది నిజమైన డిమాండ్ అని, దీనిని వెంటనే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.