Page Loader
CM KCR: రెచ్చగొట్టే వ్యాఖ్యలపై.. కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ 
CM KCR: రెచ్చగొట్టే వ్యాఖ్యలపై.. కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ

CM KCR: రెచ్చగొట్టే వ్యాఖ్యలపై.. కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ 

వ్రాసిన వారు Stalin
Nov 25, 2023
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్టోబరు 30న బాన్సువాడలో జరిగిన సభలో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్‌కు నోటీసులు అందజేయాల్సిందిగా సీఈసీని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. సీఈవో శుక్రవారం రాత్రి కేసీఆర్‌కు నోటీసులు అందజేశారు. కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. NSUI అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ చేసిన ఫిర్యాదుపై ఈసీ నోటీసులు అందజేసింది. దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి తర్వాత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈసీ కోట్ చేసింది. కత్తితో దాడి చేసిన వారికి తెలంగాణ సమాజం గుణపాఠం చెప్పాలని, తాము దాడి చేయడానికి కూడా మొండిదో ఏదో కొత్తి దొరుకుతుందని కేసీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ అభ్యంతరం చెప్పింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసు