Kalvakuntla kavitha: ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుమార్తె కవితకు అస్వస్థత
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రచార వాహనంలో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ కోసం ఆమె ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ఈ అపశృతి చోటుచేసుకుంది. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రచార వాహనంలో స్పృహ తప్పి పడిపోయిన కవితకు పక్కనే ఉన్న మహిళా కార్యకర్తలు సపర్యలు చేశారు. ఆ తర్వాత గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ కవితకు ప్రాథమిక చికిత్స అందజేశారు. అనంతరం కవిత ఆరోగ్యం కుదుటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే డీహైడ్రేషన్ వల్లే ఆమె స్పృహ తప్పిపడిపోయినట్లు డాక్టర్లు పేర్కొన్నారు.