Keralam: సొంత పార్టీలోనే మహిళా ఎమ్మెల్యేకు అవమానం.. వైరల్‌గా మారిన నేత ప్రవర్తన
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఓ మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత నుంచే చేదు అనుభవం ఎదురైంది. గౌరవం, మర్యాదలు పాటించకుండా ఓ సీనియర్ నేత వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయం సాధించింది. కొల్లాం నియోజకవర్గం నుంచి బిందు కృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. విజయానంతరం పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఆమె తిరువనంతపురంలోని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.
వివరాలు
ఘటన సమయంలో అక్కడే ఉన్న పలువురు సీనియర్ నాయకులు, పాత్రికేయులు
అక్కడ ఉన్న పార్టీ నేతలను మర్యాదపూర్వకంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో సీనియర్ నేత చెరియన్ ఫిలిప్‌ను కూడా ఆమె అభివాదం చేశారు. అయితే ఆయన మాత్రం హద్దులు దాటి ఆమెను బలవంతంగా కౌగిలించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె అసౌకర్యానికి గురయ్యారు. ఆయన ప్రవర్తనతో ఇబ్బందిపడ్డ ఆమె వెంటనే ఆయన నుంచి తప్పించుకుని కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. ఈ ఘటన సమయంలో అక్కడ పలువురు సీనియర్ నాయకులు, పాత్రికేయులు కూడా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ నేత ప్రవర్తనలో మార్పు కనిపించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా ప్రజాప్రతినిధికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత నేతపై పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మహిళా ఎమ్మెల్యేను ఇబ్బందిపెట్టిన నేత..
A video from the Kerala Pradesh Congress Committee (KPCC) headquarters in Thiruvananthapuram has gone viral after senior Congress leader Cherian Philip was seen attempting to hug newly elected Kollam MLA Adv. Bindu Krishna during a legislative party meeting, despite her apparent… pic.twitter.com/vKtfJjJZTA
— Hate Detector 🔍 (@HateDetectors) May 7, 2026