Page Loader
రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

వ్రాసిన వారు Stalin
Feb 24, 2023
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం పూర్తిస్థాయి ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాలికట్(కోజికోడ్) విమానాశ్రయం నుంచి సౌదీ అరేబీయాలోని డమ్మామ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX 385 విమానాన్ని హైడ్రాలిక్ వైఫల్యం నేపథ్యంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి మళ్లించారు. విమానం తిరువనంతపురంలో మధ్యాహ్నం 12.15 గంటలకు ల్యాండ్ అయినట్లు విమానాశ్రయంలో తెలిసిన వర్గాలు తెలిపాయి.

తిరువనంతపురం

విమానం లాండ్ అయిన ఎమర్జెన్సీని ఉపసంహరణ: అధికారులు

ఉదయం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX 385 విమానం తోక భాగం రన్‌వేని తాకినట్లు ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి. 182మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం సురక్షితమైన ల్యాండింగ్ కోసం తిరిగి తిరువనంతపురానికి విమానాన్ని మళ్లించారు. అయితే విమానం లాండ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీని కూడా ఉపసంహరించున్నట్లు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ వల్ల విమాన సేవలు ఏవీ ప్రభావితం కాలేదని విమానాశ్రయ అధికారి తెలిపారు.