Page Loader
బిడ్డకు జన్మనిచ్చిన జహాద్, దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులైన టాన్స్‌జెండర్ జంట
బిడ్డకు జన్మనిచ్చిన జహాద్, దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులైన టాన్స్‌జెండర్ జంట

బిడ్డకు జన్మనిచ్చిన జహాద్, దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులైన టాన్స్‌జెండర్ జంట

వ్రాసిన వారు Stalin
Feb 09, 2023
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోనే తొలిసారిగా కేరళకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట తల్లి దండ్రులయ్యారు. జహాద్ బుధవారం కేరళలోని కోజికోడ్ ప్రభుత్వాస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే పుట్టిన బిడ్డ ఆడ, మగ అనేది జియా పావల్, జహాద్ జంట వెల్లడించలేదు. ఇది తమ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజని జియా పావల్ పేర్కొన్నారు. తనను బాధ పెట్టేలా అనేక మంది మేసేజ్‍‌లు పంపారని, తమకు బిడ్డ పుట్టడం వారికి సమాధానం అని చెప్పారు. తమకు మద్దతు ఇచ్చిన వారందరికీ జియా కృతజ్ఞతలు తెలిపారు. పుట్టిన బిడ్డతో పాటు తన భాగస్వామి జహాద్ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు జియా వెల్లడించారు.

కేరళ

పావల్, జహాద్ దంపతులను అభినందించిన ఆరోగ్య మంత్రి జార్జ్

ప్రసవ సమయంలో జహాద్‌కు షుగర్ పెరగడంతో వైద్యులు ఆపరేషన్ చేసినట్లు జియా చెప్పారు. ప్రసవం తర్వాత జహాద్‌ను చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. పావల్, జహాద్ దంపతులను ప్రసవం అనంతరం ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అభినందించారు. కోజికోడ్ మెడికల్ కాలేజీలోని ఐఎంసీహెచ్ సూపరింటెండెంట్‌తో కూడా మంత్రి మాట్లాడారు. జహాద్‌కు అవసరమైన వైద్య సహాయం సూచించారు. జియా పురుషుడిగా పుట్టి స్త్రీగా మారగా, జహాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిపోయాడు. వారిద్దరూ తాము టాన్స్‌జెండర్స్ అని తెలుసుకున్న తర్వాత తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. మూడేళ్ల క్రితం వీరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వీరు మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.