Page Loader
కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ విడుదల, రెండేళ్లుగా జైలులోనే
కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ విడుదల

కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ విడుదల, రెండేళ్లుగా జైలులోనే

వ్రాసిన వారు Stalin
Feb 02, 2023
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

2020లో తీవ్రవాద ఆరోపణలపై అరెస్టయిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ గురువారం విడుదలయ్యారు. వాస్తవానికి గతేడాది డిసెంబరులోనే బెయిల్ లభించినా రిలీజ్ చేయలేదు. తాజాగా లక్నో సెషన్స్ కోర్టు ఆయన విడుదలపై సంతకం చేసింది. జైలు నుంచి విడుదలయ్యాక సిద్ధిక్ కప్పన్ మీడియాతో మాట్లాడారు. తనకు బెయిల్ వచ్చినా జైలులోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రూరమైన చట్టాలకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు. తాను జైలులో ఉండటం వల్ల ఎవరికి లాభం జరిగిందో తెలియడం లేదన్నారు.

కేరళ

సెప్టెంబర్‌లో యూఏపీఏ కేసులో, డిసెంబర్‌లో పీఎంఎల్‌ఏ కేసులో బెయిల్‌

2020లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన గ్యాంగ్ రేప్, హత్య వార్తను కవర్ చేసేందుకు వెళ్తుండగా సిద్ధిక్ కప్పన్‌ను అరెస్టు చేశారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)తో సంబధాలున్నాయని, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆయనపై తీవ్రవాద అభియోగాలు నమోదు చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాద నిరోధక చట్టం చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ), పీఎఫ్‌ఐ నుంచి డబ్బు అందుకున్నట్లు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసులు నమోదు చేశారు. సెప్టెంబర్‌లో యూఏపీఏ కేసులో, డిసెంబర్‌లో పీఎంఎల్‌ఏ కేసులో బెయిల్‌ పొందారు. గురువారం విడుదలయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

28నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చా: కప్పన్