Assembly Elections: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు.. తొలి గంటల్లో పోలింగ్ శాతం ఎంతంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే ఓటింగ్ మొదలవగా.. మొదటి రెండు గంటల్లోనే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. అస్సాంలో 17.87 శాతం, కేరళలో 16.23 శాతం, పుదుచ్చేరిలో 17.41 శాతం పోలింగ్ నమోదైంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు పలువురు మంత్రులు ఓటేశారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, అలాగే నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపి కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేరళలో ప్రముఖుల ఓటింగ్
#WATCH | Keralam Elections 2026 | Actor Prithviraj Sukumaran casts his vote at a polling station in Kochi, Ernakulam. pic.twitter.com/67TZoArxTX
— ANI (@ANI) April 9, 2026