Page Loader
దేశంలోనే తొలి AI టీచర్.. విద్యా బోధనలో కేరళ సరికొత్త ఆవిష్కరణ 
దేశంలోనే తొలి AI టీచర్.. విద్యా బోధనలో కేరళ సరికొత్త ఆవిష్కరణ

దేశంలోనే తొలి AI టీచర్.. విద్యా బోధనలో కేరళ సరికొత్త ఆవిష్కరణ 

వ్రాసిన వారు Stalin
Mar 06, 2024
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆధునిక విద్యకు పేరుగాంచిన కేరళ.. దేశంలోనే తొలి ఏఐ(AI) టీచర్‌ను ప్రవేశపెట్టి మరోసారి అద్వితీయమైన ముందడుగు వేసింది. ఏఐ రోబో టీచర్‌కు 'ఐరిస్‌' అని పేరు పెట్టారు. MakerLabs Edutech Pvt Ltd సహకారంతో 'ఐరిస్‌'ను రూపొందించారు. ఏఐ రోబోటిక్ టీచర్ అభివృద్ధి చేయడం ద్వారా విద్యా బోధనలో కేరళ సరికొత్త అధ్యయనానికి నాంది పలికినట్టయ్యింది. ఇటీవల తిరువనంతపురంలోని KTCT హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 'ఐరిస్‌'ను ప్రవేశపెట్టారు. ఐరిస్ అనేది హ్యూమనాయిడ్. ఇది విద్యార్థుల అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. మేకర్‌ల్యాబ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఐరిస్ వీడియోను షేర్ చేసింది. దీంతో ఏఐ టీచర్ వీడియో వైరల్‌గా మారింది.

కేరళ

మూడు భాషల్లో ఐరిస్ బోధన

నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ (ATL) ప్రాజెక్ట్ కింద 'ఐరిస్‌'ను ఆవిష్కరించారు. సాంప్రదాయ బోధనా పద్ధతులను విప్లవాత్మకంగా మార్చడానికి దీన్ని రూపొందించారు. ఐరిస్ మూడు భాషలను మాట్లాడగలదు. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. ఐరిస్ ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా అభ్యాసాలను ఇవ్వగలుగుతుంది. దీని ద్వారా విద్యార్థుల్లో అభ్యాస స్కిల్స్ అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా, ఇది పిల్లల గొంతులను వినడం ద్వారా వారికి సహాయపడుతుంది. పిల్లులు నేర్చుకోవడానికి సరదాగా ఉంటుంది. చక్రాల సహాయంతో ఇది తరగతి గదిలో కూడా తిరుగుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏఐ టీచర్ బోధన