Page Loader
కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి 

కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి 

వ్రాసిన వారు Stalin
May 08, 2023
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ మలప్పురంలోని తానూర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హౌస్‌బోట్ బోల్తా పడటంతో 22 మంది మృతి చెందారు. అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. కాపాడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మంత్రి వి అబ్దురహిమాన్ తెలిపారు. బోటు కింద మరికొంత మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. బోల్తా పడిన పడవను ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సేవా సిబ్బంది సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ప్రస్తుతం తెలియరాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి: మంత్రి రాజన్