తదుపరి వార్తా కథనం

AP Govt: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీలో 32 మంది డిప్యూటీ కలెక్టర్ బదిలీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 29, 2024
11:34 am
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ 32 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లకు ఏపీ సీఆర్డీఏలో కొత్తగా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇక ప్రోటోకాల్ డైరెక్టర్‌గా టి.మోహన్ రావు నియమితులు కాగా, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పి.రచన బాధ్యతలు స్వీకరించనున్నారు.
శ్రీకాళహస్తి దేవాలయం ఈవోగా టి.బాపిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు, ఏపీ శిల్పారామం సొసైటీ సీఈఓగా వి.స్వామినాయుడు నియామకాన్ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ సహాయ కార్యదర్శిగా డి.లక్ష్మా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.