తదుపరి వార్తా కథనం

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. మిథున్ రెడ్డికి బెయిల్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 29, 2025
04:42 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక దశకు చేరింది. ఆ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం బెయిల్‌ను షరతులతో మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం, మిథున్ రెడ్డి వారంలో రెండు రోజులు సిట్ విచారణకు హాజరు కావాలి, రెండు షూరిటీలు సమర్పించాలి. అదే విధంగా రూ. 2 లక్షల పూచికత్తు కూడా చెల్లించాలి.
Details
రేపు జైలు నుంచి రిలీజ్
కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత, రేపు (మంగళవారం) మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదల కానున్నారు. గత జులై 20న ఏపీ లిక్కర్ కేసులో సంబంధం ఉన్నారనే ఆరోపణలతో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి 71 రోజులుగా జైలులో గడిపిన ఆయన, ఇప్పుడు కోర్టు షరతుల బెయిల్ మంజూరు చేసిన తరువాత బయటకు రాబోతున్నారు.