NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు
    విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు
    భారతదేశం

    విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు

    వ్రాసిన వారు Naveen Stalin
    May 01, 2023 | 05:26 pm 0 నిమి చదవండి
    విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు
    విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు

    విడాకుల విషయంలో 6నెలల వెయిటింగ్ పీరియడ్‌‌పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం వివాహం బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైతే, ఆ కారణంతో వివాహాలను వెంటనే రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి కేసుల్లో పరస్పర అంగీకారంతో 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ తప్పనిసరి లేకుండానే విడాకులను మంజూరు చేయొచ్చని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. అలాగే మెయింటెనెన్స్, భరణం, పిల్లల హక్కులకు సంబంధించి ఈక్విటీలను ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా కోర్టు వివరించింది.

    రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ విచారణ, గతేడాది సెప్టెంబర్‌లో తీర్పు రిజర్వు

    హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బీ కింద నిర్దేశించిన విధంగా పరస్పర అంగీకారంతో 6నెలల నిరీక్షణ కాలం అవసరం లేకుండానే తన అపారమైన అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు విడాకులను మంజూరు చేయొచ్చా అనే అంశంపై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. దంపతుల మధ్య బంధం కోలుకోలేని విధంగా దెబ్బతింటే ఆర్టికల్ 142 ప్రకారం నిరీక్షణ కాలం లేకుండానే విడాకులను మంజూరు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ కేసును ఏడేళ్ల క్రితం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. సుదీర్ఘ వాదనలు విన్న రాజ్యాంగ ధర్మానసం సెప్టెంబర్ 29, 2022న రిజర్వు చేసింది. తాజాగా తీర్పు చెప్పింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    సుప్రీంకోర్టు
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్
    భారతదేశం

    సుప్రీంకోర్టు

    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం  రెజ్లింగ్
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు రెజ్లింగ్
    తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు; అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్  వైఎస్సార్ కడప
    సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్‌లో ఆడియో క్లిప్ ప్రకంపనలు  పాకిస్థాన్

    తాజా వార్తలు

    కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ నందిని పాలు ఉచితం  కర్ణాటక
    దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు  దిల్లీ
    సిరియాలో ఐఎస్ఐఎస్ నాయకుడు హతం; టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటన  సిరియా
    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక జి.కిషన్ రెడ్డి

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర వాణిజ్య సిలిండర్
    91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా? షిర్డీ సాయిబాబా
    దేశంలో కొత్తగా 9,355 మందికి కరోనా; 26 మరణాలు  కరోనా కొత్త కేసులు

    భారతదేశం

    May Day 2023: భారత్‌లో 'మే డే'ను మొదట ఎక్కడ నిర్వహించారు? తొలిసారి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ప్రపంచం
    దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు కరోనా కొత్త కేసులు
    బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు బెంగళూరు
    సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి  సూడాన్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023