
Vice President: ధన్‌కడ్ రాజీనామా తర్వాత కీలక చర్యలు.. ఈసీ ఎన్నికల షెడ్యూల్‌కు రంగం సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ అనారోగ్య కారణాలతో తన పదవికు రాజీనామా చేయడంతో, ఖాళీ అయిన ఈ అత్యంత కీలక స్థానం భర్తీకి దేశ ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఈసీ ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేయడం, రిటర్నింగ్ అధికారులను, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించడం వంటి పనులతో కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా ఉంది. ఈ ఏర్పాట్లు పూర్తయిన వెంటనే ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి లేదా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు, ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సి ఉంటుంది.
Details
రాజీనామాకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
ఇదే ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల తేదీని త్వరలో వెల్లడించనుంది. ఇదిలా ఉండగా, సోమవారం రాత్రి జగదీప్ ధన్‌కడ్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపారు. అనంతరం రాష్ట్రపతి ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఆమోదం తర్వాత సంబంధిత ఫైల్‌ను కేంద్ర హోంశాఖకు తరలించారు. కేంద్ర హోంశాఖ నుంచి ఉపరాష్ట్రపతి రాజీనామా ఆమోదం విషయాన్ని పార్లమెంట్ ఉభయసభలకు స్పీకర్‌లు, చైర్మన్ల ద్వారా తెలియజేశారు.