Rijiju: ఫిబ్రవరి 4 ఘటనపై వీడియో విడుదల.. కాంగ్రెస్‌పై రిజిజు విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ ని చుట్టుముట్టేలా కాంగ్రెస్ ఎంపీలు ముందుగానే ప్రణాళిక వేసినట్టు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. విపక్షాల నుంచి నిరసనల సమాచారం ముందే అందడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ప్రధానిని సభకు రావొద్దని సూచించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫిబ్రవరి 4న పార్లమెంట్‌లో కాంగ్రెస్ మహిళా ఎంపీలు చేసిన ఆందోళనలు, వారి అనుచిత ప్రవర్తనను చూసి ఆ పార్టీ నాయకులు గర్వపడుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఆ సమయంలో తమ ఎంపీలను అదుపులో పెట్టకపోతే పరిస్థితి మరింత చేయిదాటిపోయేదని రిజిజు వ్యాఖ్యానించారు.
వివరాలు
ప్రధాని సీటు వద్దే ఆందోళన
పార్లమెంట్ గౌరవం, పవిత్రతను కాపాడేందుకే భాజపా ఎంపీలు సహనం పాటించాల్సి వచ్చిందన్నారు. రిజిజు షేర్ చేసిన వీడియోలో కాంగ్రెస్ ఎంపీలు బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తూ ప్రధాని సీటు వద్దే ఆందోళనకు దిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆందోళన విరమించుకోవాలని రిజిజుతో పాటు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరినా, మహిళా ఎంపీలు అక్కడి నుంచి కదలకుండా నిరాకరించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
వివరాలు
అసలేమయ్యిందంటే
ఫిబ్రవరి 4న లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే సభ వాయిదా పడింది. దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, సమావేశం జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీని చుట్టుముట్టే యత్నం జరుగుతుందనే సమాచారం ముందే తనకు అందిందన్నారు. అందుకే ప్రధాని భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయనను సభకు రావొద్దని ముందుగానే సూచించానన్నారు. అయితే మోదీ సభలో లేనప్పటికీ, కాంగ్రెస్ ఎంపీలు ఆయన కుర్చీ వద్దకు వెళ్లి ఆందోళన చేయడంతో సభను వాయిదా వేయాల్సి వచ్చిందని స్పీకర్ వివరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు చేసిన ట్వీట్
Congress Party is proud of the most degrading behavior by their MPs !! If we had not stopped all BJP MPs and allowed the Women MPs to confront Cong. MPs, it would have led to very ugly scene.
— Kiren Rijiju (@KirenRijiju) February 10, 2026
We have very high consideration, to protect the dignity & sanctity of the Parliament. https://t.co/tRj5HjLKFH pic.twitter.com/aTmktk4Y7E