Hyderabad: జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
ఈ వార్తాకథనం ఏంటి
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జనవరి 13 నుంచి 15 వరకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ ఫెస్టివల్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొంటారని, అంతేకాకుండా ఇండోనేషియా, శ్రీలంక, కాఠ్‌మాండూ, స్కాట్‌లాండ్, మలేసియా, ఇటలీ, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ వంటి 50 దేశాల నుంచి దాదాపు 150 మంది ఫ్లయర్స్ కైట్ ఫెస్టివల్‌కి హాజరవుతారని చెప్పారు.
ఈ మూడు రోజుల ఫెస్టివల్‌లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, ఇందులో ఎవరైనా ఈ ఫెస్టివల్‌లో పాల్గొనవచ్చని చెప్పారు.
Details
సాంస్కృతిని ప్రోత్సహించాలి
ఇది సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటుంది.
సంస్కృతిలో భాగమైన పండుగలు గ్రామాల్లో కూడా సంస్కృతి, సంప్రదాయాలను అభివృద్ధి చేసేందుకు సహాయపడతాయని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణలోని ప్రాచీన కట్టడాలు, దేవాలయాలను పర్యటించేందుకు తెలంగాణ టూరిజం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సాంస్కృతిక విశిష్టతను మరింతగా ప్రోత్సహించవచ్చని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.