Koel Mullick: టీఎంసీకి మరో షాక్.. రాజ్యసభ సభ్యత్వానికి కోయల్ మల్లిక్ రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు కోయల్ మల్లిక్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేవలం నాలుగు నెలల క్రితమే టీఎంసీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఆమె, ఇంత తక్కువ వ్యవధిలోనే పదవిని వీడడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, తన రాజీనామా వెనుక ఉన్న కారణాలను కోయల్ మల్లిక్ ఇప్పటివరకు వెల్లడించలేదు. దీంతో ఆమె నిర్ణయంపై పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల టీఎంసీలో అసంతృప్తి స్వరాలు పెరగడం, పార్టీ నుంచి పలువురు నేతలు వైదొలగడం వంటి పరిణామాల మధ్య కోయల్ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
రాజ్యసభలో 9కి పరిమితమైన టీఎంసీ సభ్యుల సంఖ్య
ఇటీవలే టీఎంసీ సీనియర్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మదన్ మిశ్ర కూడా ఆమె వర్గాన్ని వీడి రితబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో చేరారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కోయల్ మల్లిక్ రాజీనామా టీఎంసీకి మరో షాక్‌గా మారింది.
కోయల్ మల్లిక్ రాజీనామాతో రాజ్యసభలో టీఎంసీ సభ్యుల సంఖ్య మరింత తగ్గింది. ప్రస్తుతం ఆ పార్టీ బలం 9కు పరిమితమైంది.