Konaseema: కోనసీమలో మరోసారి గ్యాస్ లీక్.. భయాందోళనలో మాచవరం గ్రామస్తులు
ఈ వార్తాకథనం ఏంటి
కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామ పరిధిలోని పంట పొలాల్లో పైప్‌లైన్ నుంచి గ్యాస్ బయటకు వస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గ్యాస్ లీకేజీ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
వివరాలు
ఈ నెల 26న కూడా గ్యాస్ లీకైన ఘటన
మరోవైపు, లీకేజీని అరికట్టేందుకు ఓఎన్జీసీ అధికారులు చర్యలు చేపట్టారు.
అయితే, ఇదే ప్రాంతంలో ఈ నెల 26న కూడా గ్యాస్ లీకైన ఘటన చోటుచేసుకుంది.
తాజాగా మరోసారి అదే ప్రాంతంలో పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో మాచవరం గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అంబాజీపేట మండలం మాచవరంలో మరోసారి లీకైన గ్యాస్
కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్
— BIG TV Breaking News (@bigtvtelugu) October 30, 2026
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో మరోసారి లీకైన గ్యాస్
ఈ నెల 26న గ్యాస్ లీకైన చోటే ఈ ఘటన
రాత్రి నుంచి లీక్ అవుతున్న గ్యాస్
అదుపు చేసేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్న నిపుణుల బృందం
ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు…