Page Loader
Koneru Konappa: బీఆర్‌ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా 
Koneru Konappa: బీఆర్‌ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా

Koneru Konappa: బీఆర్‌ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా 

వ్రాసిన వారు Stalin
Mar 06, 2024
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్ పార్టీని వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంపై ఆయన కోనేరు కోనప్ప అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి కోనేరు కోనప్పపై పోటీ చేశారు. ఈ క్రమంలో తనపై పోటీ చేసిన వ్యక్తితో కేసీఆర్ భేటీ కావడం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోడవంపై కోనేరు కోనప్ప అవమానకరంగా భావించినట్లు తెలుస్తోంది. అందుకే తన అనుచరులతో రహస్య సమావేశాలు నిర్వహించి.. బీఆర్ఎస్ వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయన త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్‌లో చేరే అవకాశం