KTR: 'మోదీజీ ఈ మూడు హామీలను మరిచారా?'.. ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోదీ నిజమాబాద్‌లో ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి కొన్ని ప్రశ్నలను సంధించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు..?.. మా బయ్యారం ఉక్క కర్మాగారం నిర్మించేదెప్పుడు..?.. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ మూడు విభజన హామీలకు దిక్కేదని, ఇంకా ఎంతకాల ఈ అబద్దాల జాతర అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. గుజరాత్‌ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ గుండెల్లో గునపాలా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్ ను ఆంగం చేశారని, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదాను తుంగలో తొక్కారని మండిపడ్డారు.