Page Loader
KTR: హైదరాబాద్‌లో 'Formula E' రేసు రద్దుపై కేటీఆర్ ఫైర్ 
KTR: హైదరాబాద్‌లో 'Formula E' రేసు రద్దుపై కేటీఆర్ ఫైర్

KTR: హైదరాబాద్‌లో 'Formula E' రేసు రద్దుపై కేటీఆర్ ఫైర్ 

వ్రాసిన వారు Stalin
Jan 06, 2024
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సిన 'Formula E' రేస్ రద్దయ్యింది. ఈ మేరకు శుక్రవారం హోస్టింగ్ కంపెనీ ట్వీట్టర్‌లో పేర్కొంది. గత సంవత్సరం, ఫిబ్రవరి 11న హుస్సేన్‌సాగర్ తీరంలో 'ఫార్ములా ఈ' రేసును ప్రారంభించారు. మొదటి ఫార్ములా రేస్ విజయవంతంగా పూర్తయ్యింది. అయితే ఈ ఏడాదికి సంబంధించిన రేసుపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హోస్టింగ్ కంపెనీ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (FIA) పేర్కొంది. దీంతో ఈ ఏడాది రేసును ఉపసంహరించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫార్ములా ఈ' ఆపరేషన్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించండపై తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్‌కు అధికారికంగా నోటీసు ఇవ్వనున్నట్లు ఎఫ్ఐఏ తెలిపింది.

హైదరాబాద్

తిరోగమన నిర్ణయం: కేటీఆర్

హైదరాబాద్‌లో ఫార్ములా - ఈ రేసును రద్దు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. ఫార్ములా - ఈ రేసు రద్దు నిర్ణయం అనేది ప్రభుత్వం తిరోగమన నిర్ణయంగా అభివర్ణించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే ఇలాంటి నిర్ణయాలు సరికాదనే అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేసారు. ఈ-ప్రిక్స్‌ వంటి ఈవెంట్‌లు హైదరాబాద్ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా పెంచుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ రేసు చక్కటి అవకాశమని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా, రాష్ట్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని సైతం ప్రారంభించామన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేటీఆర్ ట్వీట్