Page Loader
KU Ragging: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్​.. 81 మంది విద్యార్థినుల సస్పెండ్ 
KU Ragging: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్​.. 81 మంది విద్యార్థినుల సస్పెండ్

KU Ragging: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్​.. 81 మంది విద్యార్థినుల సస్పెండ్ 

వ్రాసిన వారు Stalin
Dec 23, 2023
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

KU Ragging: వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం రేపుతోంది. అది కూడా ఉమెన్స్ హాస్టల్ అయిన పద్మావతి వసతి గృహంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. ర్యాగింగ్‌‌కు పాల్పడిన 81 మంది విద్యార్థినులను హాస్టల్స్ నుంచి అధికారులు సస్పెండ్ చేశారు. కేయూ ఏర్పడినప్పటి నుంచి ఇంత మందిని ఒకేసారి సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వాస్తవానికి కొన్నిరోజులుగా యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతుందంటూ.. ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కొందరు జూనియర్ విద్యార్థులు కూడా యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు.

కేయూ

పరిచయ కార్యక్రమాల పేరుతో వేధింపులు

జూనియర్ విద్యార్థినుల ఫిర్యాదు మేరకు విచరాణ చేపట్టిన అధికారులు.. ర్యాగింగ్ జరుగుతుందని నిర్ధారించారు. పరిచయ కార్యక్రమాల పేరుతో జూనియర్లను సీనియర్ అమ్మాయిలు వేధిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ర్యాగింగ్‌పై నివేదికను తయారు చేసిన అధికారులు.. కేయూ రిజిస్టార్‌కు అందజేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన 81 మంది అమ్మాయిలను కేయూ రిజిస్టార్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీల్లో గ్రూపులకు చెందిన సీనియర్ విద్యార్థినులు ఉన్నారు. సస్పెండ్ అయిన విద్యార్థినులు వెంటనే హాస్టల్స్ ఖాళీ చేయాలని రిజిస్టార్ ఆదేశించారు. ర్యాగింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.