LOADING...
Kurnool Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి 
కర్నూలు బస్సు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ,రాష్ట్రపతి

Kurnool Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్నూలు జిల్లా చిన్నటేకూరు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుళ్లలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు ఇంధన ట్యాంకర్‌ను బైక్ ఢీకొట్టిన కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా మృతిచెందారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి రూ. 2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ. 50,000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

వివరాలు 

ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన రాష్ట్రపతి 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ట్విటర్‌లో వ్యాఖ్యానిస్తూ, ఈ ఘటనను విచారకరంగా పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు మరియు మృతులకు సంతాపం తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాష్ట్రపతి చేసిన ట్వీట్ 

వివరాలు 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఈ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు సహా సంబంధిత రాష్ట్ర అధికారులతో సంప్రదించి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరణించిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో కలిసి సహాయ చర్యలను పర్యవేక్షించాలని చెప్పారు. ఘటనా స్థలానికి వెంటనే కలెక్టర్,ఎస్పీలను పంపాలని ఆదేశించారు. అదనంగా, ప్రజలకు సహాయం అందించడానికి హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.