Page Loader
Karni Sena: కర్ణి సేన అధినేతను హత్య చేసిన ప్రధాన నిందితుడి గుర్తింపు 
Karni Sena: కర్ణి సేన అధినేతను హత్య చేసిన ప్రధాన నిందితుడి గుర్తింపు Karni Sena: కర్ణి సేన అధినేతను హత్య చేసిన ప్రధాన నిందితుడి గుర్తింపు

Karni Sena: కర్ణి సేన అధినేతను హత్య చేసిన ప్రధాన నిందితుడి గుర్తింపు 

వ్రాసిన వారు Stalin
Dec 06, 2023
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లో కర్ణి‌సేన (Karni Sena) అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి (Sukhdev Singh Gogamedi) హత్య కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. భూవివాదమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గోగమేడిని మంగళవారం ఆయన ఇంట్లోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హత్య జరిగినప్పటి నుంచి పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించి, సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు. ఈ సమయంలో పోలీసులు నిందితుడిని గుర్తించారు.

పోలీసులు

రాథోడ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు

నిందితుడిని రోహిత్ రాథోడ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాథోడ్ నాగౌర్ జిల్లా నివాసి. గోగమేడితో రాథోడ్‌కు భూవివాదం ఉన్నట్లు పోలీసులకు కూడా తెలిసింది. ఈ హత్యకు రోహిత్ రాథోడ్‌కు నితిన్ ఫౌజీ, నవీన్‌ షెకావత్‌ సహకరించారు. నవీన్‌ షెకావత్‌, రోహిత్‌ రాథోడ్‌, నితిన్‌ ఫౌజీలు పెళ్లి కార్డు ఇస్తాననే నెపంతో కర్ణి సేన అధినేతను కలిశారని తెలుస్తోంది. భూవివాదం ఈ వివాదం కారణంగానే గోగమేడిని రాథోడ్ తన స్నేహితులతో కలిసి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రాథోడ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు పలు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.