Page Loader
జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా కమాండర్ హతం
జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా కమాండర్ హతం

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా కమాండర్ హతం

వ్రాసిన వారు Stalin
Sep 19, 2023
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ హతమయ్యాడు. దీంతో ఏడు రోజులుగా అనంత్‌నాగ్‌లో చేస్తున్న ఆపరేషన్‌కు ముగింపు పలికినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. హతమైన ఉగ్రవాది నుంచి ఆయుధాలను స్వాధీనం చేస్తున్నట్లు ఏడీజీపీ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఉజైర్ ఖాన్ మరణంతో ఏడు రోజుల పాటు జరిగిన ఎన్‌కౌంటర్ ముగిసినట్లు అధికారి ప్రకటించారు. ఉజైర్ ఖాన్ మృతదేహం వద్ద మరో ఉగ్రవాది శవం కూడా పడి ఉందని విజయ్ కుమార్ వెల్లడించారు. అయితే ఆ మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉజైర్ ఖాన్ నుంచి ఆయుధాలు స్వాధీనం