TG SSC Results 2026 : తెలంగాణ టెన్త్ ఫలితాలపై తాజా అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రతి పరీక్షకు మధ్యలో విద్యార్థులకు మూడు నుంచి నాలుగు రోజుల గ్యాప్ ఇస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16 నాటికి అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తికానున్నాయి. పరీక్షలు కొనసాగుతుండగానే మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను కూడా అధికారులు ప్రారంభించారు. ఈ మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 23 నాటికి ముగియనుంది. ఆ తర్వాత ఫలితాల ప్రాసెసింగ్, సాంకేతిక అంశాల పరిశీలన వంటి పనులు చేపడతారు. ఏప్రిల్ 23 నాటికి స్పాట్ వాల్యూయేషన్ పూర్తయితే, దాని తరువాత సుమారు ఒక వారం పాటు క్రోడీకరణ (ట్యాబ్యులేషన్) ప్రక్రియ కొనసాగుతుంది.
వివరాలు
ఏప్రిల్ చివరినాటికి ఫలితాలు
ఈ ప్రక్రియ అంతా పూర్తయితే ఏప్రిల్ చివరి నాటికి ఫలితాల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. అన్నీ అనుకూలంగా ఉంటే ఏప్రిల్ 30న లేదా మే మొదటి వారంలో తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. గతేడాది కూడా ఏప్రిల్ 30ననే ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో, ఈసారి కూడా అదే టైమ్‌లైన్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఏప్రిల్ 30కు సాధ్యం కాకపోతే మే మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ [https://bse.telangana.gov.in/](https://bse.telangana.gov.in/) లో చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలను సులభంగా తెలుసుకునే వీలుంది.