Page Loader
Lavu Srikrishna Devarayalu: లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా 
లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా

Lavu Srikrishna Devarayalu: లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2024
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

పల్నాడు జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టే విషయంలో పార్టీ నాయకత్వంలో రాజకీయ అనిశ్చితి, గందరగోళం కారణంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. దేవరాయలు 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున నరసరావుపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే పార్టీ అధిష్టానం ఇటీవల నియోజకవర్గాల్లో మార్పులు చేస్తోందని, దేవరాయలును నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. నరసరావుపేట నుండే పోటీ చేయాలనీ నిర్ణయించుకున్న ఆయన అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు.

Details 

నరసరావుపేట నుంచి బీసీ అభ్యర్థి

నాగార్జున యాదవ్ పేరు ప్రస్తావనకు రావడంతో నరసరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని వైఎస్సార్సీపీ యోచిస్తోంది. అయితే పల్నాడు జిల్లాకు చెందిన నాయకులు, నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు దేవరాయలును కొనసాగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడుతుందనే చర్చ సాగుతోంది. కాగా, దేవరాయలు పార్టీకి రాజీనామా చేయడంతోపాటు ఎంపీ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.