తదుపరి వార్తా కథనం
Janasena: 'డిప్యూటీ సీఎం' అంశంపై నేతలు స్పందించవద్దు.. జనసేన కీలక ఆదేశాలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 21, 2025
05:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనపై పలువురు టీడీపీ నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో, ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గత కొన్ని రోజులుగా టీడీపీ, జనసేన నేతలు ఈ విషయంపై తమకిష్టమైన విధంగా స్పందించారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధిష్ఠానం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇకపై ఈ అంశంపై పార్టీకి చెందిన ఎవరూ బహిరంగంగా మాట్లాడకూడదని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని ఆదేశాలు ఇచ్చింది.
ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కూడా సోమవారం ఓ ప్రకటన చేసింది. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయడం గురించి ఎవరూ మీడియా ముందు మాట్లాడకూడదని పార్టీ నేతలకు సూచించింది.