Page Loader
DGP Jitender: హైదరాబాద్‌లో పాకిస్తానీయులకు 'లీవ్ ఇండియా' పేరుతో నోటీసులు జారీ!
హైదరాబాద్‌లో పాకిస్తానీయులకు 'లీవ్ ఇండియా' పేరుతో నోటీసులు జారీ!

DGP Jitender: హైదరాబాద్‌లో పాకిస్తానీయులకు 'లీవ్ ఇండియా' పేరుతో నోటీసులు జారీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గామా ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ పై దౌత్య దాడికి దిగింది. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న పాకిస్తానీయులను స్వదేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లోని పాకిస్తానీయులకు 'లీవ్ ఇండియా' పేరుతో నోటీసులు అందజేసిన అధికారులు, మొత్తం 230 మంది పాకిస్తానీయుల వివరాలను గుర్తించారు. వీరిలో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నట్లు గుర్తించారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న ఎనిమిది మందికి దేశం విడిచిపోవాలని నోటీసులు జారీ చేశారు.

Details

ఈనెల 29 వరకు గడువు

మెడికల్ వీసాలు తీసుకున్న పాకిస్తానీయులకు ఈ నెల 29 వరకు గడువు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం విడిచిపోవాలని డిజిపి జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నవారు దేశం విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. వీరందరూ స్వదేశానికి వెళ్ళేందుకు వాఘా-అట్టారీ బార్డర్‌ వైపు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బార్డర్ వద్ద తీవ్ర వాతావరణం నెలకొంది.