
Manoj Sinha: యూరీకి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా.. ఎందుకంటే !
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం పాక్‌పై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతంగా ముగిసింది.
ఈ ప్రతిఘటన నేపథ్యంలో పాక్ భద్రతా దళాలు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయాయి.
ఉత్తర కాశ్మీర్‌లోని యూరీ, కుప్వారా వంటి సరిహద్దు ప్రాంతాల్లో భారత భద్రతా దళాల పోస్టులపై, జనావాసాలపై నిరంతరం షెల్లింగ్ జరుపుతున్నాయి.
గురువారం రాత్రి దాయాది పాక్ తన దురుద్దేశాలను కొనసాగిస్తూ జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని పలు సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది.
ఆ ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్ల ద్వారా కాల్పులు జరిపింది. అంతేకాకుండా, పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్, రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించి ఉద్రిక్తతను మరింత పెంచింది.
వివరాలు
భద్రతా చర్యలపై సమీక్ష
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కాల్పులకు గురైన యూరీ ప్రాంతానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా త్వరలోనే వెళ్లనున్నారు.
అక్కడ నిరంతర కాల్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న భద్రతా బలగాలను ఆయన స్వయంగా కలుసుకుని వారితో మాట్లాడనున్నట్లు సమాచారం.
అనంతరం అక్కడి ప్రజల పరిస్థితిని తెలుసుకోవడం, వారికి జరిగిన నష్టం, భద్రతా చర్యలపై సమీక్ష చేయడం కోసం ఆయన సందర్శన నిర్వహించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యూరీకి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా
J&K LG Manoj Sinha is visiting Uri to meet soldiers and review the ground situation
— THE NEW INDIA (@THENEWINDIA23) May 9, 2025
(File pic) pic.twitter.com/BzLnHUzUU3