Tahir Hussain: ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసు.. ఆప్ మాజీ నేతకు జీవిత ఖైదు
ఈ వార్తాకథనం ఏంటి
2020 ఈశాన్య దిల్లీ అల్లర్ల సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. మత విద్వేషాలను ప్రేరేపించడం,అల్లర్లలో పాల్గొనడం,దాడులకు పాల్పడటం,నేరపూరిత బలప్రయోగం చేయడం,హత్య వంటి అభియోగాలు రుజువయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. 2020 ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఈశాన్య దిల్లీలో జరిగిన నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. ఈ ఘటనల్లో మొత్తం 53మంది ప్రాణాలు కోల్పోగా, 700మందికిపైగా గాయపడ్డారు. అదే సమయంలో ఐబీ అధికారి అంకిత్ శర్మను అత్యంత దారుణంగా హత్య చేసిన దుండగులు, ఆయన మృతదేహాన్ని చంద్‌బాగ్ పులియా సమీపంలోని ఖజూరీ ఖాస్ కాలువలో పడేశారు.
వివరాలు
తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురు దోషులు.. జీవిత ఖైదు విధిస్తూ తీర్పు
ఈ ఘటనపై మృతుడి తండ్రి రవీందర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దయాల్‌పుర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
కేసును విచారించిన కోర్టు తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురిని దోషులుగా తేల్చింది. అనంతరం వారందరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.